వాతావరణశాఖ ( (IMD) కీలక అప్ డేట్ ఇచ్చింది. తెలంగాణలో పలు జిల్లాలకు రైన్ అలర్ట్ జారీచేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 13 ( ఆదివారం) అర్దరాత్రి వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నేయ బంగాళాతంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ( అక్టోబర్ 14) నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బంగాళాఖాతం దక్షిణాన మరో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో ఒక వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 14, 15, 16, 17 తేదీల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి అని IMD చెప్పింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఆకాశం మేఘావృతమై,, చల్లటి గాలులు వీస్తాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.... తెలంగాణలో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. నదీతీరప్రాంతంలో ఈ వేగం దాదాపు 20 కిలోమీటర్ల వేగం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఆదివారం ( అక్టోబర్ 13)న రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి. సాయంత్రం 5 గంటల తరువాత వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాత్రి 8 గంటల తరువాత ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయి.
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెండు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి. సాయంత్రం 5 తర్వాత చాలా ప్రాంతాల్లో జల్లులు మొదలవుతాయి. రాత్రి 8 తర్వాత హైదరాబాద్ పరిసరాలు, ఉత్తర తెలంగాణ, ఏపీలోని తీర ప్రాంతం అంతటా మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి. రాత్రి 11 తర్వాత రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.